Share News

అఫ్గాన్‌ ప్లేయర్‌పై కాసుల వర్షం... కోట్లు ఖర్చు చేసిన ముంబై!

ABN , Publish Date - Oct 02 , 2026 | 02:24 PM

ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2026 వేలంలో అఫ్గానిస్తాన్ పేస‌ర్ ఫజల్హక్ ఫరూఖీపై కాసుల వ‌ర్షం కురిసింది. భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సొంతం చేసుకుంది.

అఫ్గాన్‌ ప్లేయర్‌పై కాసుల వర్షం... కోట్లు ఖర్చు చేసిన ముంబై!
Fazalhaq Farooqi

స్పోర్ట్స్ డెస్క్: దుబాయ్ వేదిక‌గా ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్‌టీ2026)వేలం జరిగింది. ఈ అక్షన్‌లో అఫ్గానిస్తాన్ పేస‌ర్ ఫజల్హక్ ఫరూఖీకు జాక్ పాట్ తగిలింది. ఈ వేలంలో 3,80,000 యూఎస్ డాలర్ల (భారత కరెన్సీలో రూ. 3.6 కోట్లు)కు ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సొంతం చేసుకుంది. త‌ద్వారా ఐఎల్‌టీ20 చ‌రిత్ర‌లోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆట‌గాడిగా ఫ‌రూఖీ నిలిచాడు.


ఈ రికార్డు ఫరూఖీ కంటే ముందు వెస్టిండీస్ ఆట‌గాడు ఆండ్రీ ఫ్లెచర్ పేరిట ఉండేది.ఐఎల్‌టీ సీజ‌న్ 4 వేలంలో ఫ్లెచ‌ర్‌ను 2,60,000 డాలర్ల(రూ. 2.45 కోట్లు)కు ఎంఐ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. తాజాగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ ఫ‌రూఖీపై భారీ మొత్తాన్ని వెచ్చించి త‌మ రికార్డును తామే బద్దలు కొట్టింది. కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం, ఎంఐ ఎమిరేట్స్ యాజమాని ఒక్క‌రే కావ‌డం గ‌మ‌నార్హం.


మరోవైపు ఇదే వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్‌స్టోన్, అఫ్గానిస్థాన్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రహ్మనుల్లా గుర్బాజ్‌ల‌కు భారీ ధరకు అమ్ముపోయారు. లివింగ్‌స్టోన్‌ను 350,000 డాలర్ల(రూ.3.36 కోట్లు)కు, గుర్బాజ్‌ను 310,000 (దాదాపు రూ.3 కోట్లు) గల్ఫ్ జెయింట్స్ తమ 'రైట్-టు-మ్యాచ్' ఆప్షన్‌ను ఉపయోగించి సొంతం చేసుకున్నాయి.


ఇదే వేలంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి దుబాయ్ క్యాపిటల్స్ అతడిని 3,00,000 డాలర్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. మొత్తంగా ఫరూఖీ భారీ ధర పలకడంతో ఈ లీగ్‌లో పేసర్లకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

ఈఫిల్ టవర్ ఉదంతంపై విచారణ.. బాప్స్‌కు క్లీన్ చిట్

హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలి: జేడీ వాన్స్

Updated Date - Oct 02 , 2026 | 02:26 PM