Share News

రోహిత్, కోహ్లీ గాయపడ్డ పులుల్లా బ్యాటింగ్ చేస్తున్నారు: భారత మాజీ క్రికెటర్

ABN , Publish Date - Oct 02 , 2026 | 01:45 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి విమర్శకులకు సమాధానం చెప్పాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో హిట్‌మ్యాన్ శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్, కోహ్లీ గాయపడ్డ పులుల్లా బ్యాటింగ్ చేస్తున్నారు: భారత మాజీ క్రికెటర్
Sadagopan Ramesh

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ తన బ్యాట్‌తో మరోసారి విమర్శకులకు సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్‌తో చివరి వన్డేలో అద్భుత సెంచరీ చేసిన హిట్‌మ్యాన్.. తాజాగా వెస్టిండీస్‌తో రెండో వన్డేలోనూ శతకంతో చెలరేగాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-అజిత్ అగార్కర్ మధ్య విభేదాలపై వచ్చిన వార్తలపై అతడు స్పందించాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌లో రోహిత్‌కు చోటు ఉండకూడదనే ఉద్దేశంతో అగార్కర్ ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయని.. అయితే హిట్‌మ్యాన్ వరుస సెంచరీలతో తన సత్తా చాటుతున్నాడని రమేశ్ పేర్కొన్నాడు.


‘వచ్చే ఏడాది ప్రపంచకప్ జట్టులో రోహిత్ ఉండకూడదని అజిత్ అగార్కర్ గట్టిగా భావించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఆయన పదవీకాలం పొడిగించలేదని కూడా ప్రచారం జరిగింది. కానీ రోహిత్ మాత్రం వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని పదే పదే నిరూపిస్తున్నాడు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేసిన తర్వాత కూడా సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేయగలిగాడంటే అతడి ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రోహిత్ జట్టులో చోటుపై అగార్కర్ తన వైఖరిని చూసి బాధపడుతుండొచ్చు’ అని సదగోపన్ రమేశ్ తన యూట్యూబ్ ఛానల్‌లో వ్యాఖ్యానించాడు.


రోహిత్, కోహ్లీ మధ్య పోటీ

రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా అద్భుత ఫామ్‌లో ఉండటాన్ని రమేశ్ ప్రస్తావించాడు. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఒకరినొకరు స్ఫూర్తిగా తీసుకుంటూ పరుగులు సాధిస్తున్నారని చెప్పాడు. ‘ఇప్పుడు రోహిత్, విరాట్ మధ్య ఒక ప్యాటర్న్ కనిపిస్తోంది. ఒకరు సెంచరీ చేస్తే.. వెంటనే మరొకరు కూడా శతకంతో బదులిస్తున్నారు. ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంది. ఇద్దరూ గాయపడిన పులుల్లా బ్యాటింగ్ చేస్తున్నారు. ఇలాంటి ఫ్లాట్ పిచ్‌పై, ఇలాంటి బౌలింగ్ దాడిపై రోహిత్ సెంచరీ చేయడం ఆశ్చర్యం కలిగించదు. అతడు ప్రస్తుతం ఎంతో ఆగ్రహంతో, దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తోంది’ అని రమేశ్ పేర్కొన్నాడు.


ఇవి కూడా చదవండి:

శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది: హర్భజన్ సింగ్

భారత్-పాక్ ఫైనల్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ ఎవరికంటే?

Updated Date - Oct 02 , 2026 | 01:45 PM