Share News

శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది: హర్భజన్ సింగ్

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:59 PM

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

శుభ్‌మన్ గిల్‌ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తోంది: హర్భజన్ సింగ్
Harbhajan Singh

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డేలో గిల్ రికార్డు డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును కొనియాడాడు. అండర్-19 రోజుల నుంచే గిల్‌ను చూస్తున్నానని, అనుభవం పెరుగుతున్న కొద్దీ అతడి ఆట మరింత మెరుగవుతోందని హర్భజన్ పేర్కొన్నాడు.


‘కాలం గడిచేకొద్దీ శుభ్‌మన్ గిల్ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నాడు. ఇప్పుడు అతడే జట్టు కెప్టెన్. అండర్-19 రోజుల నుంచి అతడి ఆటను గమనిస్తున్నా. అనుభవం పెరిగిన కొద్దీ అతడి ఆట మరింత మెరుగవుతోంది. అతడి ఎదుగుదలకు అంతే లేదు. భవిష్యతుల్లో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. గిల్ ఈ స్థాయికి రావడం గర్వంగా ఉంది. ఇందులో అతడి తండ్రి పాత్ర ఎంతో కీలకం. ఎవరూ ఇంత వేగంగా 200 పరుగులు చేయలేదు. ఇది అద్భుతమైన ఇన్నింగ్స్. శుభ్‌మన్‌కు, అతడి తండ్రికి నా అభినందనలు. గిల్ సాధించిన ఈ పరుగులతో అతడి కంటే ఎక్కువగా సంతోషించేది అతడి తండ్రే’ అని హర్భజన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు: బాక్సింగ్‌లో లవ్లీనా సంచలనం.. భారత్‌కు మరో పసిడి

వన్డే ప్రపంచ కప్: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. పార్థివ్ పటేల్ సెటైర్లు

Updated Date - Oct 02 , 2026 | 01:08 PM