వన్డే ప్రపంచ కప్: పాకిస్థాన్‌కు అంత సీన్ లేదు.. పార్థివ్ పటేల్ సెటైర్లు
ABN , Publish Date - Oct 02 , 2026 | 08:32 AM
వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ పాకిస్థాన్ జట్టుపై సరదాగా సెటైర్లు వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్-2027 షెడ్యూల్‌ను ఐసీసీ గురువారం ప్రకటించింది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. ఆరు జట్ల చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, అఫ్గానిస్థాన్‌తో పాటు క్వాలిఫయర్-ఏ జట్టు ఉండనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ పార్థివ్ పటేల్ పాకిస్థాన్ జట్టుపై సరదాగా సెటైర్లు వేశాడు.
గ్రూప్ దశలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్-7 దశకు అర్హత సాధిస్తాయి. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానంలో నిలిచిన జట్లలో మెరుగైన జట్టుకు కూడా సూపర్-7లో చోటు దక్కుతుంది. అనంతరం ఏడు జట్లు ఒకదానితో ఒకటి తలపడతాయి. గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్-7 దశకు బదిలీ కావు. ఈ దశలో ఒక్కో జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడుతుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 14 వరకు సూపర్-7 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో టాప్-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరతాయి. ఈ ఫార్మాట్‌పై స్పందించిన పార్థివ్ పటేల్.. పాకిస్థాన్ జట్టును ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
‘జట్ల ఆలోచనా విధానం ఒక్కో విధంగా ఉంటుంది. ఈ షెడ్యూల్ చూసిన తర్వాత భారత్ కనీసం సెమీఫైనల్‌కు చేరాలని భావిస్తుండొచ్చు. కానీ పాకిస్థాన్ మాత్రం.. ‘మనం కచ్చితంగా సూపర్-7 దశకు చేరతాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని అనుకుంటుండొచ్చు. ఈ షెడ్యూల్ చూసి పాకిస్థాన్ సంతోషించే ఉంటుంది. ఎలాగైనా సెకండ్ రౌండ్‌కు చేరతామని వాళ్లు భావిస్తుండొచ్చు. అంత కంటే ముందు రౌండ్‌కు వెళ్లేంత సీన్ వాళ్లకి లేదు’ అంటూ పాకిస్థాన్‌పై పార్థివ్ సెటైర్ వేశాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: ఆర్చరీలో భారత్‌కు చారిత్రక స్వర్ణం
పెళ్లయ్యాక హనీమూన్ కోసం జపాన్‌కే వస్తా: ఇషాన్ కిషన్