గణేష్ కంచుమోత
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:21 AM
టీమ్ ఈవెంట్లలో పసిడి పంట పండించిన కాంపౌండ్ ఆర్చర్లు.. వ్యక్తిగత పోటీల్లో మాత్రం ఘోరంగా తడబడ్డారు. తెలుగు ఆర్చర్ గణేష్ కాంస్యం దక్కించుకోగా..
నిరాశపరచిన ఆర్చర్ చికిత
సెయిలింగ్, గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో రజతాలు
సెమీ్‌సలో ఓడిన స్క్వాష్ జట్లు
టీమ్ ఈవెంట్లలో పసిడి పంట పండించిన కాంపౌండ్ ఆర్చర్లు.. వ్యక్తిగత పోటీల్లో మాత్రం ఘోరంగా తడబడ్డారు. తెలుగు ఆర్చర్ గణేష్ కాంస్యం దక్కించుకోగా.. చికిత పతకం లేకుండా ముగించింది. సెయిలింగ్‌లో అనూహ్యంగా రజత, కాంస్యాలు సొంతం చేసుకోగా.. గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో నితేశ్ సివాచ్.. ఆరు దశాబ్దాల తర్వాత ఆసియా క్రీడల్లో రజతం అందించాడు. ఇక, సెమీస్‌లో ఓడిన స్క్వాష్ పురుషులు, మహిళల జట్లు కాంస్యాలకే పరిమితం కాగా.. క్రికెట్, హాకీ జట్లు ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మొత్తంగా క్రీడలకు 12వ రోజు రెండు రజతాలు సహా ఆరు పతకాలు సాధించిన భారత్.. మొత్తం 64 మెడల్స్‌తో 8వ స్థానంలో కొనసాగుతోంది.
నగోయ: ఆర్చరీలో మన బాణాలు గురితప్పడంతో.. పతక జోరు మందగించింది. గణేష్ మణిరత్నం తిరుమూరు కాం స్యం అందించగా.. డబుల్ గోల్డ్‌తో మెరిసిన చికిత క్వార్టర్స్‌లో నిరాశపరచింది. గురువారం జరిగిన కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ కాంస్య పోరులో గణేష్ 149-144తో కాంగ్ డు డాంగ్ (వియత్నాం)పై గెలిచాడు. అంతకుముందు జరిగిన సెమీ స్‌లో గణేష్ 144-148తో జాం గో కిమ్ (కొరియా) చేతిలో కంగుతిన్నాడు. కిమ్ స్వర్ణం నెగ్గగా.. చైనీస్ తైపీ ఆర్చర్ చంగ్ వి చాంగ్ రజతం దక్కించుకొన్నాడు. కాగా, మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్స్‌లో చికిత 143-144తో నూరిసా డయన్ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది.
కాంస్యాలతో సరి..
స్క్వాష్ టీమ్ ఈవెంట్లలో భారత పురుషులు, మహిళల జట్లు కాంస్యాలతో సరిపెట్టుకొన్నాయి. పురుషుల సెమీ్‌సలో భారత్ 1-2తో మలేసియా చేతిలో ఓడింది. తొలి సింగిల్స్‌లో అభయ్ సింగ్ 0-3 (8-11, 8-11, 8-11)తో ఇయాన్ యు ఎన్‌జీ చేతిలో ఓడినా.. రెండో మ్యాచ్‌లో వీర్ 3-0 (11-4, 11-8, 11-5)తో సంజయ్ జీవపై గెలిచి సమం చేశాడు. కానీ, నిర్ణాయక మూడో మ్యాచ్‌లో సెంథిల్ కుమార్ 1-3 (12-10, 6-11, 8-11, 9-11)తో అమీషన్‌రాజ్ చంద్రన్ చేతిలో పరాజయం పాలుకావడంతో భారత ఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. మహిళల సెమీ్‌సలో భారత్ 1-2తో హాంకాంగ్ చేతిలో చిత్తయింది. తొలి సింగిల్స్‌లో అనాహత్ 2-3తో ఓడినా.. రెండో మ్యాచ్‌లో తన్వీ 3-1తో గెలిచింది. కానీ మూడో మ్యాచ్‌లో జోష్న చిన్నప్ప 0-3తో ఓడింది.
సెయిలర్లు అనూహ్యంగా..
అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సెయిలర్లు అనూహ్యంగా రజత, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల స్కిఫ్‌లో మను ఫ్రాన్సిస్, నోబెల్ కురిసెంకాల్‌లు తొమ్మిది రేస్‌ల తర్వాత రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకొన్నారు. చైనా, హాంకాంగ్‌లు స్వర్ణ, కాంస్యాలు నెగ్గాయి. మహిళల స్కిఫ్‌లో హర్షిత తోమర్, శీతల్‌వర్మ నాలుగో స్థానంలో నిలిచారు. అయితే మూడోస్థానంలో ఉన్న చైనాపై అనర్హత వేటు పడడంతో భారత్‌కు కాంస్యం దక్కింది. జపాన్, హాంకాంగ్ స్వర్ణ, రజతాలు సాధించాయి.
చారిత్రక పతకం మిస్..
గ్రీకో-రోమన్ రెజ్లింగ్ ఫైనల్లో నితేశ్ నిరాశపర్చాడు. కానీ, ఈ విభాగంలో 1962 తర్వాత రజతం సాధించిన తొలి భారత రెజ్లర్‌గా రికార్డులకెక్కాడు. పురుషుల 97 కిలోల ఫైన ల్లో సివాచ్ 0-4తో యూరీ నకజటో (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు. అంతకుముం దు జరిగిన సెమీ్‌సలో నితేశ్... గన్‌బాటర్ (మంగోలియా)ను మట్టికరిపించాడు.
ఈ వార్తలు కూడా చదవండి
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు
రూ. 9లక్షల కోట్లు ఆవిరి.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..