Share News

ఆసియా క్రీడలు: ఆర్చరీలో భారత్‌కు చారిత్రక స్వర్ణం

ABN , Publish Date - Oct 02 , 2026 | 07:22 AM

ఆసియా క్రీడలు 2026లో శుక్రవారం భారత్ పసిడితో పతకాల వేట మొదలుపెట్టింది. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది.

ఆసియా క్రీడలు: ఆర్చరీలో భారత్‌కు చారిత్రక స్వర్ణం
Women's Recurve Team

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో శుక్రవారం భారత్ పసిడితో పతకాల వేట మొదలుపెట్టింది. మహిళల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించింది. సౌత్ కొరియా ఆధిపత్యానికి చెక్ పెడుతూ కుమ్‌కుమ్, అంకిత, కీర్తిల త్రయం పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో టీమిండియా 5-3 తేడాతో కొరియాను ఓడించింది.


తొలి రెండు సెట్లు డ్రా కావడంతో పోటీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తర్వాత రెండు సెట్లలో భారత ఆర్చర్లు ఏమాత్రం తడబడకుండా లీడ్ సాధించారు. మహిళల రికర్వ్‌ విభాగంలో దక్షిణ కొరియాకు ఉన్న ఆధిపత్యాన్ని భారత అమ్మాయిలు బద్దలు కొట్టారు. 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో దక్షిణ కొరియా స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే. అలాంటి జట్టును ఓడించి భారత్‌ చారిత్రాత్మక పసిడి దక్కించుకోవడం విశేషం. ఈ విజయంతో భారత్ ఖాతాలో స్వర్ణ పతకాల సంఖ్య 11కు చేరింది.


ఇవి కూడా చదవండి:

విండీస్‌పై విజయం తర్వాత టీమిండియాకు భారీ షాక్..

ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. 8 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్‌కి పిలుపు

Updated Date - Oct 02 , 2026 | 07:37 AM