ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 8 ఏళ్ల తర్వాత ఆ ప్లేయర్‌కి పిలుపు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:37 PM
పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
స్పోర్ట్స్ డెస్క్: త్వరలో పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ కోసం 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓ ప్లేయర్ ప్రత్యేకంగా నిలిచాడు. అందుకు కారణంగా దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అతడికి జాతీయ జట్టులో స్థానం దక్కింది. అతడే ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ మేసన్ క్రేన్. చాలా కాలం తర్వాత సెలెక్టర్లు క్రేన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు.
మేసన్ క్రేన్ చివరగా 2018లో ఇంగ్లండ్ తరపున ఆడాడు. ఇక క్రేన్‌తో పాటు యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్‌కు కూడా అవకాశం దక్కింది. అదేవిధంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్, ఆల్‌రౌండర్ సామ్ కరన్ తిరిగి జట్టులోకి వచ్చారు. వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు అవకాశం లభించింది.
ఇక ఈ ముక్కోణపు సిరీస్ నుంచి స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌కు విశ్రాంతి ఇచ్చారు సెలెక్టర్లు. ఆర్చర్‌తో పాటు జోస్ బట్లర్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా పాకిస్థాన్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ప్రారంభం ఈ సిరీస్ ప్రారంభం కానుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న వన్డే ప్రపంచ కప్-2027 సన్నాహకాల్లో భాగంగా ఈ ట్రై సిరీస్ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు 2026: పాక్‌ను చిత్తు చేసిన భారత్
నమీబియా క్రికెటర్ సంచలనం.. 41 ఏళ్ల వయసులో హ్యాట్రిక్