ఆసియా క్రీడలు 2026: పాక్‌ను చిత్తు చేసిన భారత్
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:38 PM
ఆసియా క్రీడలు 2026లో ఫురుషుల భారత హాకీ జట్టు పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరింది. 4-3 తేడాతో భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడలు 2026లో భారత హాకీ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మహిళల విభాగంలో నిన్న దక్షిణ కొరియాపై గెలిచి భారత్ ఫైనల్‌కు చేరుకోగా.. తాజాగా భారత పురుషుల జట్టు కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. ఉత్కంఠంగా సాగిన సెమీస్‌లో భారత్ 4-3 తేడాతో పాక్‌ను చిత్తు చేసి.. బంగారు పతకం గెలవాలని పట్టుదలతో ఉంది.
తొలి అర్ధ భాగంలో భారత్ హాకీ జట్టు 3-1తో ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే, రెండో అర్ధ భాగంలో పాకిస్థాన్ జట్టు అనూహ్యంగా పుంజుకొని స్కోర్లను సమం చేసింది. ఆఖరి నిమిషంలో అభిషేక్ అద్భుతమైన గోల్‌తో భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో భారత (Team India) క్రీడాకారులు హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్.. సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్ చెరో గోల్ చేశారు. గత పదేళ్ల వ్యవధిలో పాక్‌పై భారత్ ఇప్పటివరకు వరుసగా 21 మ్యాచ్‌లు గెలిచింది.
మరోవైపు ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో ఒకే ఎడిషన్‌లో (Asian Games 2026) పురుషుల, మహిళల హాకీ జట్లు బంగారు పతకాలను గెలవలేదు. ఈసారి ఆ అవకాశం మన ఆటగాళ్లకు వచ్చింది. మలేసియా, కొరియా మ్యాచ్ విజేతతో శనివారం భారత పురుషుల జట్టు ఫైనల్‌లో తలపడనుంది. ఇక మహిళా జట్టు శుక్రవారం(అక్టోబర్ 02) చైనాతో స్వర్ణం కోసం పోటీపడనుంది. ఆసియా క్రీడలు 2026లో ప్రస్తుతం భారత్ 62 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇందులో 10 స్వర్ణాలు, 21 రజతాలు, 31 కాంస్యాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ సాధించిన మాజీ మావోయిస్టులు..
మచ్చార్‌పై గొడ్డలితో దాడి.. అసలు విమానంలో గొడ్డలి ఎందుకు ఉంది?