Share News

మచ్చార్‌పై గొడ్డలితో దాడి.. అసలు విమానంలో గొడ్డలి ఎందుకు ఉంది?

ABN , Publish Date - Oct 01 , 2026 | 03:53 PM

ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. టేకాఫ్ అయిన రెండున్నర గంటల తర్వాత కాక్‌పిట్ లోపల హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.

 మచ్చార్‌పై గొడ్డలితో దాడి.. అసలు విమానంలో గొడ్డలి ఎందుకు ఉంది?
Flydubai cockpit attack

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో చోటుచేసుకున్న ఘటన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. టేకాఫ్ అయిన రెండున్నర గంటల తర్వాత కాక్‌పిట్ లోపల చోటుచేసుకున్న హింసాత్మక దాడి విమానాన్ని పెను ప్రమాదంలోకి నెట్టింది. ఒమన్‌కు చెందిన కో-పైలట్, విమాన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌ (భారతీయుడు)పై దారుణంగా దాడి చేశాడు. ఈ క్రమంలో విమానం కేవలం ఒక్క నిమిషంలోనే 33,000 అడుగుల ఎత్తు నుంచి 17,000 అడుగులకు పడిపోయింది. ఈ ఆందోళనకర పరిస్థితుల్లోనే విమానాన్ని చివరకు సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.


బయటి ఆయుధం కాదు... కాక్‌పిట్ గొడ్డలే!

తొలుత కేటరింగ్ కత్తులతో ఈ దాడి జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ, దర్యాప్తు సంస్థల ప్రాథమిక నివేదికలు మరో విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దాడి చేసిన వ్యక్తి ఎలాంటి ఆయుధాన్ని బయటి నుండి తీసుకురాలేదని, కాక్‌పిట్ లోపల అత్యవసర సమయాల్లో నిల్వ ఉంచే ‘క్రాష్ యాక్స్’ (గొడ్డలి)ను ఉపయోగించి దాడి చేశాడని సీబీఎస్ న్యూస్ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇదే అంశాన్ని ధృవీకరించారు.


కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది?

అంతర్జాతీయ విమానయాన నిబంధనల (ICAO) ప్రకారం.. ప్రతి వాణిజ్య విమానంలో అత్యవసర పరిస్థితుల కోసం కాక్‌పిట్‌లో ఒక క్రాష్ యాక్స్ ఉండటం తప్పనిసరి. విమానం ప్రమాదానికి గురైనప్పుడు లేదా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర ద్వారాలు తెరుచుకోకపోతే, ప్యానెళ్లను లేదా కిటికీలను పగలగొట్టి బయటపడటానికి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తారు.


గతంలో ఈ గొడ్డళ్లను కాక్‌పిట్‌లో ఉంచేవారు. కానీ, 2001లో అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడుల తరువాత భద్రతా నియమాలను కఠినతరం చేశారు. ప్రయాణికులకు లేదా దుండగులకు ఇవి చిక్కకుండా ఉండేందుకు, కేవలం పైలట్లకు మాత్రమే అందుబాటులో ఉండేలా వీటిని కాక్‌పిట్ లోపలికి మార్చారు. అయితే, భద్రత కోసం ఉంచిన ఈ ఆయుధమే ఇప్పుడు తోటి పైలట్‌పై దాడికి సాధనంగా మారడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

నమీబియా క్రికెటర్ సంచలనం.. 41 ఏళ్ల వయసులో హ్యాట్రిక్

ఆసియా క్రీడలు 2026: ఫైనల్లో భారత్, పాక్

Updated Date - Oct 01 , 2026 | 03:58 PM