Share News

ఆసియా క్రీడలు 2026: ఫైనల్లో భారత్, పాక్

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:21 PM

క్రికెట్‌ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్న దాయాదుల సమరానికి రంగం సిద్ధమైంది. ఆసియా క్రీడలు-2026 టీ20 క్రికెట్‌ టోర్నీ ఫైనల్లో భారత్- పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

ఆసియా క్రీడలు 2026: ఫైనల్లో భారత్, పాక్
india vs pakistan

స్పోర్ట్స్ డెస్క్: ఆసియా క్రీడలు-2026లో భాగంగా పురుషుల టీ20 క్రికెట్‌ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ ఫైనల్‌కి చేరాయి. తొలి సెమీ ఫైనల్‍లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ ఓడించగా.. రెండో సెమీస్‌లో భారత్, శ్రీలంకను చిత్తుచేసింది. దీంతో ఇరు జట్లు గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనున్నాయి.


ఇవాళ(గురువారం) తెల్లవారుజామున జరిగిన తొలి సెమీస్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌- బంగ్లాదేశ్‌ తలపడ్డాయి. వర్షం అంతరాయం కలిగించిన కారణంగా మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన పాక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 13 ఓవర్లలో 7 కోల్పోయిన బంగ్లా 111 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పాక్ 11.3 ఓవర్లలో పని పూర్తి చేసింది.


రెండో సెమీ ఫైనల్లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. ఇక టార్గెట్‌ ఛేదించే క్రమంలో శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఫలితంగా భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి.. ఫైనల్లో పాక్‌తో తలపడేందుకు రెడీ అయ్యింది.


అక్టోబర్ 3వ తేదీన ఈ రెండు జట్లు స్వర్ణం కోసం తలపడనున్నాయి. కొరొగి స్పోర్ట్స్ పార్కులో ఈ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు మొదలు ప్రారంభం కానుంది. చిరకాల ప్రత్యర్థులు చివరగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 15న తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..

ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్

Updated Date - Oct 01 , 2026 | 02:23 PM