నమీబియా క్రికెటర్ సంచలనం.. 41 ఏళ్ల వయసులో హ్యాట్రిక్
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:14 PM
నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్ 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని, తమ ప్రదర్శనకు అవరోధం కాదని కొందరు సీనియర్ క్రికెటర్లు నిరూపిస్తూంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్. 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీస్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్ వేసిన వీస్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు సాధించాడు. తొలుత ప్రమాదకరంగా కనిపించిన డ్వేన్ ప్రిటోరియస్‌ను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత శివం శర్మ, సుఖ్‌జిందర్ సింగ్‌ను వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దీంతో వీస్ తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు.కెనడా సూపర్ 60 లీగ్ కంటే ముందు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోనూ రోటర్‌డామ్ డాకర్స్ తరఫున వీస్ సత్తా చాటాడు. అక్కడ కేవలం 10 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.
వీస్ 2024 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వివిధ టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. వీస్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 15 వన్డేలు, 54 టీ20లు ఆడిన వీస్.. 74 వికెట్లు, 4 అర్ద సెంచరీలు సాధించాడు. మరోవైపు వీస్‌కు అంతర్జాతీయ కెరీర్ తక్కువే అయినా.. పొట్టి ఫార్మాట్‌లో మాత్రం అపార అనుభవం ఉంది. ఈ ఫార్మాట్‌లో అతడు ఏకంగా 434 మ్యాచ్‌లు ఆడి 358 వికెట్లు తీయడంతో పాటు 4,734 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు 2026: ఫైనల్లో భారత్, పాక్
ఆసియా క్రీడలు.. సెయిలింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రజతం