ఆసియా క్రీడలు.. సెయిలింగ్ పురుషుల విభాగంలో భారత్‌కు రజతం
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:13 PM
ఆసియా క్రీడల్లో సెయిలింగ్ పోటీల్లో భారత్ రజత పతకం సాధించింది. పురుషుల విభాగంలో మనూ ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురుసింకాల్ సెయిలింగ్‌లో ఖాతా తెరిచి ఇండియాకు రజత పతకం అందించారు. ఈ పోటీలో మను, ప్రిన్స్ జోడి రెండో స్థానంలో నిలవడంతో రజతం వచ్చింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో సెయిలింగ్ పోటీల్లో భారత్ రజత పతకం సాధించింది. పురుషుల విభాగంలో మనూ ఫ్రాన్సిస్, ప్రిన్స్ కురుసింకాల్ సెయిలింగ్‌లో ఖాతా తెరిచి ఇండియాకు రజత పతకం అందించారు. ఈ పోటీలో మను, ప్రిన్స్ జోడి రెండో స్థానంలో నిలవడంతో రజతం వచ్చింది. సెయిలింగ్‌తో పాటు రెస్లింగ్‌లోనూ మనకు పతకం ఖాయమైంది. రెస్లింగ్ పురుషుల విభాగంలో గ్రీకో-రోమన్ 97 కిలోల కేటగిరిలో నితేశ్ సివాచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఫైనల్లోనూ విజయం సాధిస్తే బంగారు పతకం వస్తుంది. అంటే రెస్లింగ్‌లో గోల్డ్ మెడల్‌కు భారత్ అడుగు దూరంలో ఉంది.
ఇక సెపక్‌తక్రాలో భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల విభాగంలో క్వాడ్రాంట్ గ్రూప్ ఏ మ్యాచ్‌లో వియత్నాంను ఓడించి సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో సెపక్‌తక్రాలో ఏదో ఒక పతకం భారత్‌కు ఖాయమైనట్లైంది. కాగా.. స్క్వాష్‌లో సెమీఫైనల్లో హాంగ్ కాంగ్ చేతిలో భారత్ ఓటమి పాలైంది. ఈ ఆటలో మహిళల విభాగంలో 2-1 తేడాతో ఓడిపోవడంతో కాంస్య పతకం దక్కింది. ఆర్చరీలో నిరాశ ఎదురైంది. రెండుసార్లు పసిడి పతక విజేత చికిత తానిపర్తి.. మహిళల వ్యక్తిగత విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. అలాగే, పురుషుల వాలీబాల్‌లోనూ క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్