Share News

స్వర్ణ పోరుకు భారత్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 06:18 AM

ఆసియా క్రీడల స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆశించిన రీతిలోనే ఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో గురువారం జరిగిన రెండో సెమీ్‌సలో...

స్వర్ణ పోరుకు భారత్‌

ఇషాన్‌ హాఫ్‌ సెంచరీ

సెమీ్‌సలో శ్రీలంకపై ఘనవిజయం

పాక్‌తో ఫైనల్‌ జూఆసియాడ్‌ క్రికెట్‌

నిస్సిన్‌: ఆసియా క్రీడల స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీమిండియా ఆశించిన రీతిలోనే ఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో గురువారం జరిగిన రెండో సెమీ్‌సలో భారత్‌ 124 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. శనివారం జరిగే స్వర్ణ పతక మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అలాగే అదే రోజు కాంస్యం కోసం శ్రీలంక జట్టు బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇషాన్‌ (80 నాటౌట్‌), వైభవ్‌ (38) రాణించారు. శ్రేయాస్‌ (13), అభిషేక్‌ (7), సంజూ (7) నిరాశపరచారు. తర్వాత అక్షర్‌ (8), తిలక్‌ (2), దూబే (3) కూడా విఫలమయ్యారు. సహన్‌, థరిందులకు రెండేసి వికెట్లు లభించాయి. ఆ తర్వాత ఛేదనలో శ్రీలంక ద్వితీయ శ్రేణి జట్టు 9.5 ఓవర్లు మాత్రమే ఆడి 45 పరుగులకు కుప్పకూలింది. నువనీదు ఫెర్నాండో (15) మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా, ఐదుగురు డకౌట్లవడం గమనార్హం. అభిషేక్‌, బుమ్రా, అక్షర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన తొలి సెమీ్‌సలో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.

సంక్షిప్త స్కోర్లు:

భారత్‌: 20 ఓవర్లలో 169/7 (ఇషాన్‌ 80 నాటౌట్‌, వైభవ్‌ 38; సహన్‌ 2/28, థరిందు 2/32);

శ్రీలంక: 9.5 ఓవర్లలో 45 ఆలౌట్‌ (నువనీడు 15; అభిషేక్‌ 2/2, బుమ్రా 2/7, అక్షర్‌ 2/8)

10-sports.jpg

1

టీ20ల్లో అత్యల్ప స్కోరు (45)ను నమోదు చేసిన శాశ్వత సభ్య దేశ జట్టుగా వెస్టిండీస్‌తో సమంగా నిలిచిన శ్రీలంక

1

పురుషుల టీ20 టోర్నమెంట్స్‌లో సెమీస్‌ లేక ఫైనల్లో భారీ తేడా (124 రన్స్‌) తో గెలిచిన జట్టుగా భారత్‌. అలాగే 100+ తేడాతో ఎక్కువ సార్లు (11) గెలిచిన జట్టుగానూ నిలిచింది.

3

ఓ క్యాలెండర్‌ ఏడాదిలో ఎక్కువ 50+ స్కోర్లు (8) సాధించిన మూడో బ్యాటర్‌గా ఇషాన్‌. విరాట్‌ (2016లో 7)ను అధిగమించాడు.

Updated Date - Oct 02 , 2026 | 06:18 AM