Share News

విండీస్‌పై విజయం తర్వాత టీమిండియాకు భారీ షాక్..

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:29 PM

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టుకు 24 గంటలు తిరగకముందే బిగ్ షాక్ తగిలింది. శనివారం జరగనున్న మూడో వన్డేకు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడు.

విండీస్‌పై విజయం తర్వాత టీమిండియాకు భారీ షాక్..
Prasidh Krishna Injury

స్పోర్ట్స్ డెస్క్: గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఈ ఆనందంలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. శనివారం(అక్టోబర్ 02) చండీగఢ్‌లో జరగనున్న మూడో వన్డేకు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ దూరమయ్యాడు.


రెండో వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ తొడ కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. అనంతరం అతడికి వైద్య పరీక్షలు నిర్వహించగా... గాయం తీవ్రమైనదిగా వెల్లడైనట్లు సమాచారం. దీంతో అతడు మూడో వన్డే కోసం భారత జట్టుతో ప్రయాణించకుండా నేరుగా బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో రిపోర్ట్ చేయాలని పిలుపు వచ్చింది.


'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో అతడు తన రీహాబ్ ప్రక్రియను ప్రారంభించనున్నాడు. ఈ గాయం కారణంగా అతడు రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రసిద్ధ్ స్థానంలో చివరి వన్డే కోసం అన్షుల్ కాంబోజ్ను సెలక్టర్లు ఎంపిక చేసినట్లు సమాచారం. కాంబోజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.


మరోవైపు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ నుంచి వాషింగ్టన్ సుందర్‌ను బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తప్పించింది. అతడి స్థానంలో నమన్ ధీర్‌కు చోటు కల్పించింది. న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

ఆసియా క్రీడలు 2026: భారత్‌ ఖాతాలో రెండు కాంస్య పతకాలు!

ఆసియా క్రీడలు 2026: పాక్‌ను చిత్తు చేసిన భారత్

Updated Date - Oct 01 , 2026 | 08:51 PM