Share News

వరల్డ్ కప్ 2027: గంగూలీ ‘టీమిండియా’ ఎంపిక.. కుల్‌దీప్‌కు షాక్!

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:07 PM

ఐసీసీ 2027 పురుషుల వన్‌డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నీపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

వరల్డ్ కప్ 2027: గంగూలీ ‘టీమిండియా’ ఎంపిక.. కుల్‌దీప్‌కు షాక్!
Sourav Ganguly

స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ 2027 పురుషుల వన్‌డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక మెగా టోర్నీపై క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వన్‌డే ప్రపంచకప్‌2027లో బరిలోకి దిగే తన డ్రీమ్ ‘భారత తుది జట్టు’ను వెల్లడించాడు.


ఓ స్పోర్ట్స్ ఛానల్‌తో మాట్లాడిన దాదా, దక్షిణాఫ్రికాలోని వాతావరణం, అక్కడి పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తన జట్టును ఎంపిక చేశాడు. గంగూలీ ఎంపిక చేసిన జట్టులో టాప్ ఆర్డర్‌లో ఎటువంటి మార్పులు లేవు. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ కొనసాగుతారని తెలిపాడు. మిడిల్ ఆర్డర్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు అప్పగించాడు.


అయితే, ఈ జట్టులో గంగూలీ ఆల్‌రౌండర్లకు పెద్దపీట వేశాడు. జట్టు సమతుల్యత కోసం మూడో ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్‌ను ఎంచుకోగా.. మరో స్థానం కోసం రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబెలలో ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని అభిప్రాయపడ్డాడు. బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్లకు ప్రాధాన్యమిస్తూ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలకు చోటు కల్పించాడు.


కుల్‌దీప్ యాదవ్‌కు దాదా షాక్:

ఇటీవలి కాలంలో వన్‌డేల్లో అద్భుతమైన ఫామ్‌లో ఉంటూ వేగంగా 200 వికెట్లు తీసిన స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌ను గంగూలీ తన తుది జట్టు నుంచి మినహాయించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దక్షిణాఫ్రికా పిచ్‌ల స్వభావాన్ని బట్టి పేస్, ఆల్‌రౌండ్ ఆప్షన్లకే దాదా మొగ్గు చూపారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


గంగూలీ ఎంచుకున్న భారత తుది జట్టు:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా / వాషింగ్టన్ సుందర్ / శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.


ఇవి కూడా చదవండి:

రెడ్ బాల్ క్రికెట్‌‌కు చాహల్ గుడ్‌బై.. ఫస్ట్ క్లాస్ ఆటకు స్వస్తి!

ఆసియా క్రీడలు 2026: భారత్‌కు పర్వీన్ హూడా పసిడి కానుక!

Updated Date - Oct 02 , 2026 | 05:07 PM