హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులకు పోలీసుల కీలక సూచన
ABN , Publish Date - Nov 20 , 2026 | 08:23 PM
గురునానక్ 557వ జయంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నవంబర్ 21వ తేదీ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో సిక్కుల మతపరమైన ఊరేగింపు ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 20: గురునానక్ 557వ జయంతి నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నవంబర్ 21వ తేదీ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో సిక్కుల మతపరమైన ఊరేగింపు ఉంటుందని తెలిపారు. అశోక్ బజార్ గురుద్వారా నుంచి ఈ ఊరేగింపు ప్రారంభమవుతుందని చెప్పారు. అఫ్జల్‌గంజ్, ఎస్.ఏ. బజార్, ఎంజే మార్కెట్, పుత్లీబౌలి మీదుగా శంకర్ షేర్ హోటల్ మార్గం మీదుగా తిరిగి గురుద్వారాకు చేరుకుంటుందని వివరించారు.
పుత్లీబౌలి నుంచి మదీనా వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ స్టేషన్ రోడ్, ఎస్.జే. బ్రిడ్జి మీదుగా మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గౌలిగూడ, ఎస్.ఏ. బజార్ నుంచి వచ్చే వాహనాలను శంకర్ షేర్ హోటల్ వద్ద ఎస్.జే. బ్రిడ్జి, రంగమహల్ వైపు మళ్లిస్తామని అన్నారు. మదీనా నుంచి ఎంజే మార్కెట్ వైపు వచ్చే వాహనాలను డెంటల్ కాలేజీ లేన్, ఎంజే బ్రిడ్జి, అలాస్కా మీదుగా మళ్లిస్తామని చెప్పారు. సిటీ కాలేజీ, జుమ్మెరాత్ బజార్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వాహనాలను బేగంబజార్ ఛత్రి, అలాస్కా మీదుగా మళ్లిస్తామని పేర్కొన్నారు.
పురానాపూల్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను దారుస్సలాం, అలాస్కా, ఎంజే మార్కెట్ మీదుగా మళ్లిస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం తమ ఫేస్ బుక్ పేజీని ఫాలో కావాలని వాహనదారులకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజల నాడి పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన రాహుల్ గాంధీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు ఏపీకి 750 ఐబ్రెస్ట్ పరికరాలు: మంత్రి సత్యకుమార్
Read Latest Telangana News And Telugu News