Share News

రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు ఏపీకి 750 ఐబ్రెస్ట్ పరికరాలు: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:29 PM

మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రొమ్ములో కణుతులు, అసాధారణ మార్పులను గుర్తించేందుకు సెన్సార్ల ఆధారంగా పనిచేసే అత్యాధునిక ఐబ్రెస్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది.

రొమ్ము క్యాన్సర్ గుర్తింపునకు ఏపీకి 750 ఐబ్రెస్ట్ పరికరాలు: మంత్రి సత్యకుమార్

అమరావతి, నవంబర్20: మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రొమ్ములో కణుతులు, అసాధారణ మార్పులను గుర్తించేందుకు సెన్సార్ల ఆధారంగా పనిచేసే అత్యాధునిక ఐబ్రెస్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకురానుంది. అందుకోసం రాష్ట్రానికి సుమారు రూ.56 కోట్ల విలువైన 750 పరికరాలు వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.


త్వరలో నిర్వహించనున్న నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌ సర్వేలో ఈ పరికరాలను వినియోగించనున్నారని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా లక్షలాది మంది మహిళలకు ఈ పరీక్షలను చేపట్టనున్నట్లు వివరించారు. ఇప్పటికే మెడ్‌టెక్‌ చాలెంజ్‌ ద్వారా కృత్రిమ మేధ ఆధారిత వైద్య సేవలకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మంత్రి సత్యకుమార్ గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జమ్మలమడుగు బీజేపీలో రాజీనామాల ప్రకంపనలు.. ఇద్దరు జడ్పీటీసీల రాజీనామా

ఇందిరమ్మ బీమాలో మార్పులు

For More AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 05:58 PM