Share News

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కేంద్రంగా హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:42 AM

ఫిన్‌టెక్‌, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు.

గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కేంద్రంగా హైదరాబాద్‌
Sridhar Babu

  • ‘అర్థ ఫిన్‌టెక్‌’ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఫిన్‌టెక్‌, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు చెప్పారు. ప్రపంచ స్థాయి డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పన, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ‌స్‌లో పరిశోధన, అభివృద్ధి(ఆర్‌డీ)కి ప్రోత్సాహం, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం గల మానవ వనరులను తీర్చిదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.


సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న అర్థ ఫిన్‌టెక్‌ హైదరాబాద్‌ కార్యాలయాన్ని శనివారం హైటెక్‌ సిటీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ... ఐటీ రంగంలో హైదరాబాద్‌ సాధించిన అంతర్జాతీయ గుర్తింపును ఫిన్‌టెక్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగాలకూ విస్తరించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామన్నారు. తెలంగాణ రైజింగ్‌-2047 విజన్‌లో భాగంగా పెట్టుబడులకు, ఆవిష్కరణలకు, ఎమర్జింగ్‌ టెక్నాలజీ‌స్‌కు దేశంలోనే అత్యుత్తమ గమ్య స్థానంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సంక్రాంతి తర్వాత ప్రజాబలం

రావిర్యాల భూములు బ్లాక్‌లో

వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 04:42 AM