Share News

నగరంలో ఏనుగు దంతాల విక్రయం.. ముఠాను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ

ABN , Publish Date - Oct 01 , 2026 | 09:17 PM

హైదరాబాద్‌లో ఏనుగు దంతాలు విక్రయిస్తున్న ముఠాను ఈరోజు (గురువారం) డీఆర్ఐ అదుపులోకి తీసుకుంది.

నగరంలో ఏనుగు దంతాల విక్రయం.. ముఠాను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ
elephant tusks

హైదరాబాద్, అక్టోబర్ 1: నగరంలో ఏనుగు దంతాలు విక్రయిస్తున్న ముఠాను ఈరోజు (గురువారం) డీఆర్ఐ (DRI-Directorate of Revenue Intelligence) అదుపులోకి తీసుకుంది. 17 కిలోలున్న 4 ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుంది. అక్రమంగా ఏనుగు దంతాల విక్రయానికి ప్రయత్నిస్తున్న ముగ్గురిని అధికారులు అరెస్ట్ చేశారు. విక్రయం జరుగుతున్న సమయంలో వల పన్ని ఈ ముఠాను పట్టుకున్నారు. దంతాలతో పాటు కళాత్మకంగా చెక్కిన ఐవరీ ట్రోఫీలు కూడా డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


ఏనుగు దంతాల రవాణా, క్రయవిక్రయాలపై నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ దంతాలతో వస్తువులు చేయడం, వాటిని అమ్మడం కూడా నేరమే. అయినా కొందరు వీటిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అక్రమ రవాణాపై డీఆర్ఐ నిఘా పెట్టింది.


ఈ వార్తలూ చదవండి

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క

హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు..

Updated Date - Oct 01 , 2026 | 09:20 PM