ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం.. పోలీసులకు ఫిర్యాదు
ABN , Publish Date - Oct 01 , 2026 | 04:37 PM
ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. యూనివర్సిటీలో గంజాయి మొక్కను గుర్తించిన సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కనిపించడం కలకలం రేపింది. యూనివర్సిటీ ప్రాంగణంలో గంజాయి మొక్కను గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని యూనివర్సిటీ సిబ్బంది కోరారు. అయితే విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో మత్తు పదార్థాల మొక్క కనిపించడంపై వర్సిటీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి మొక్క యూనివర్సిటీ పరిధిలోకి ఎలా వచ్చింది.. ఈ మొక్కను పెంచడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ మొదలుపెట్టారు. దర్యాప్తులో మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్కను గుర్తించడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఈసీకి హెచ్చరిక
‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Read Latest Telangana News And Telugu News