రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:50 PM
ఏపీలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించామని మంత్రి నారాయణ అన్నారు.
నెల్లూరు, అక్టోబర్ 1: ఏపీలోని 123 మున్సిపాలిటీల అభివృద్ధికి రెండేళ్లలో అధికమొత్తంలో నిధులు కేటాయించామని మంత్రి నారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. వైజాగ్, విజయవాడలో వేలాది మందికి శాశ్వత నివాస ధ్రువీకరణ పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ’నెల్లూరులోనూ గతంలో 1450 మందికి పట్టాలిచ్చామని తెలిపారు. త్వరలో మరో 1250 మందికి పట్టాలిస్తాం. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల్లో విజయం సాధిస్తాం. నా కుటుంబ సభ్యుల్లో కూడా ఎవరూ రాజకీయాల్లోకి రారు. నా కూతురు షరణి మేయర్‌గా పోటీ చేయరు. ఇవన్నీ వట్టి ఆరోపణలు. నాపై ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. నేను పట్టించుకోను. పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగానే కన్పిస్తుంది. ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజలకు సేవ చేస్తాను’ అని మంత్రి నారాయణ అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News