హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు.. సెల్ఫీల కోసం ఎగపడిన అభిమానులు..
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:02 PM
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి ఆయన నగరానికి విచ్చేశారు.
హైదరాబాద్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్యతో కలిసి భాగ్యనగరానికి చేరుకున్నారు. పెడల్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి ఆయన నగరానికి విచ్చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఎంఎస్ ధోనీ దంపతులు చేరుకోగా.. అప్పటికే పెద్దఎత్తున వేచి చూస్తున్న అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగపడగా వారిని పోలీసులు నిలువరించారు.
అనంతరం ధోనీ దంపతులు అక్కడి నుంచి జూబ్లీహిల్స్‌కు బయలుదేరారు. రోడ్ నంబర్-34కి చేరుకుని, కార్యక్రమంలో పాల్గొనున్నారు. అక్కడ వారిద్దరూ దాదాపు అరగంట పాటు ఉండనున్నారు. హైదరాబాద్‌కు ఎంఎస్ ధోనీ దంపతుల రాకతో పోలీసులు అప్రమత్తయ్యారు. పటిష్ట బందోబస్తుతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. నగరానికి ధోనీ చేరుకున్న క్షణం నుంచి తిరిగి పయనమయ్యే వరకూ పటిష్ట చర్యలు చేపట్టనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
సాయి తేజ మృతి ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ సీరియస్.. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు..
‘మా ఆస్తులు, మీ ఆస్తులపై విచారణకు సిద్ధం’.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్