Share News

హైదరాబాద్‌ ఈస్ట్‌లో 72 అంతస్తులు..

ABN , Publish Date - Jul 09 , 2026 | 09:34 AM

హైదరాబాద్‌ మహా నగరంలో ఆకాశాన్ని తాకే హర్మ్యాలు పశ్చిమవైపు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తూర్పు వైపు కూడా అంతకు మించిన స్థాయిలో వస్తున్నాయి.

హైదరాబాద్‌ ఈస్ట్‌లో 72 అంతస్తులు..
Hyderabad 72 storey building

  • భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగరంలో ఆకాశాన్ని తాకే హర్మ్యాలు పశ్చిమవైపు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తూర్పు వైపు కూడా అంతకు మించిన స్థాయిలో వస్తున్నాయి. హైదరాబాద్‌ తూర్పు వైపు గల మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ ప్రాంతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు సమీపంలోనే 72 అంతస్తుల భవనం రాబోతుంది.. రాష్ట్రంలోనే కాదు.. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద భవనంగా నిలవబోతుంది. ఇప్పటికే ప్రాజెక్టు అనుమతుల కోసం అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌ఓసీ సైతం పొందినట్లు తెలిసింది.


city3.jpgఇక ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత కీలకమైన అనుమతుల కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ వద్ద పరిశీలన దశలో ఉన్నట్లు సమాచారం. 72 అంతస్తుల భవనం కావడంతో ప్రాజెక్టుకు ఉండాల్సిన నియమ, నిబంధనల్లో పలు లోపాలునట్లు గుర్తించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆయా లోపాలను సరిదిద్దుకోవాలని హెచ్‌ఎండీఏ సూచనలు చేసినట్లుగా తెలిసింది. ఈ భారీ ప్రాజెక్టును డాన్సింగ్‌ డెఫోడైల్‌ థీమ్‌తో నిర్మించడానికి ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఈ భవనం ఎత్తు సుమారుగా 245 మీటర్లు వరకు ఉండొచ్చని,


ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులో 3 పడక గదులు ఉండే 692ఫ్లాట్లు 4పడక గదులు ఉండే 274ఫ్లాట్లు నిర్మించనునట్లు తెలిసింది. ఈ 72 అంతస్తుల నిర్మాణానికి ఎయిర్‌పోర్టు ఆథారిటీ నుంచి కూడా క్లియరెన్స్‌ ఉండాలి. ప్రాజెక్టులో నీటి వినియోగంపై వాటర్‌బోర్డు నుంచి ఫిజిబులిటీ సర్టిఫికెట్‌ను జతపర్చాల్సి ఉంటుంది. పలు శాఖల నుంచి క్లియరెన్స్‌ వచ్చిన తర్వాత నియమ, నిబంధనల అనుగుణంగా ప్రాజెక్టు డిజైన్లు ఉంటే తుది అనుమతులు హెచ్‌ఎండీఏ జారీ చేస్తుందని ఓ అధికారి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 09:34 AM