బస్ కోసం వేచి చూస్తున్న మహిళలపైకి దూసుకెళ్లిన బొలెరో
ABN , Publish Date - Jul 09 , 2026 | 09:27 AM
శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్‌స్టాప్‌లో బస్ కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది.
హైదరాబాద్, జులై 9: శంషాబాద్ సమీపంలోని శాతంరాయి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈరోజు(గురువారం) ఉదయం బస్‌స్టాప్‌లో బస్ కోసం వేచి చూస్తున్న ముగ్గురు మహిళలపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మిర్చి లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ముందు వెళ్తున్న వాహనాన్ని క్రాస్ చేయాలని చూసింది. అయితే ఒక్కసారిగా వాహనం స్కిడ్ అవడంతో బస్టాప్‌లో ఉన్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు మహిళలు వాహనం కింద నలిగిపోయారు.
తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు కింద పడి యువకుడి మృతి
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు బైక్‌పై వెళ్తుండగా అది స్కిడ్ అవడంతో వెనకాలే వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడిపోయాడు. దీంతో యువకుడు ఘటనాస్థలిలోనే దుర్మరణం చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
యూట్యూబర్ జోసఫ్ రావణ్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్
Read Latest Telangana News And Telugu News