Share News

ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. కారును ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jul 09 , 2026 | 08:59 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక భయానక వీడియోలో ఒక గజరాజు కారును తుక్కు తుక్కు చేసింది. వాహనాన్ని అమాంతం పైకెత్తి కిందకేసి కొడుతూ ఏనుగు విధ్వంసం సృష్టించింది..

ఏనుగుకు కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.. కారును ఏం చేసిందో చూడండి..
Furious Elephant Destroys Car

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఏనుగులు తమ దారిన తాము ప్రశాంతంగా సాగిపోతుంటాయి. కానీ ఒక్కసారి వాటికి కోపం వస్తే మాత్రం ఆపడం ఎవరి తరం కాదు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా గజరాజు రచ్చరచ్చ చేసింది. రోడ్డు పక్కన ఉన్న ఒక కారుపై పడ్డ ఆ ఏనుగు, దాన్ని బొమ్మ కార్లాగా అమాంతం పైకి లేపుతూ, కింద పడేస్తూ ముక్కలు ముక్కలు చేసింది.


ఈ వీడియో until_next_tym_ అనే యూజర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘వామ్మో ఏనుగును చూస్తే భయమేస్తోంది’ అని, ‘ఆ ఏనుగు ఏదో డిప్రేషన్‌లో ఉంది’ అని ఒక నెటిజన్, ‘ఏనుగుకు కోపం వస్తే ఏదైనా తుక్కు చేస్తుంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

అదృశ్యమైన పాకిస్థాన్ కార్గో విమానం.. అరేబియా సముద్రం‌లో గాలింపు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే.

Updated Date - Jul 09 , 2026 | 09:05 AM