వరంగల్‌లో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి, 15 మందికి గాయాలు
ABN , Publish Date - Jul 09 , 2026 | 08:30 AM
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ముత్తోజిపేట దగ్గర మినీ ట్రక్కు బోల్తాపడి ఒకరు మృతి చెందగా, 15 మందికి గాయాలు అయ్యాయి.
వరంగల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ముత్తోజిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి మేడారం వెళ్తున్న మినీ ట్రక్కు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపు తప్పి జాతీయ రహదారి పైనుంచి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదానికి టైరు పేలడమే కారణమని ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి పరిస్థితిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్