కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య!
ABN , Publish Date - Oct 28 , 2026 | 06:30 AM
హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఎడెబిల్లి రాజేష్ (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైటెక్‌సిటీ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఎడెబిల్లి రాజేష్ (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో మంగళవారం జరి గింది. ఏపీలోని విశాఖపట్నం పెదవాల్తేరుకు చెందిన రాజేష్ నాచారం లో ఉంటూ కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్నాడు.
సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజేష్ అయ్యప్ప సొసైటీలో ఉన్న మిత్రుడి గదికివెళ్లి మద్యం సేవించినట్టు తెలిసింది. ఆ తర్వాత మంగళవారం ఉదయం స్నేహితుడితో కలిసి కేబుల్ బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. అనంతరం రాజేష్ కనిపించకపోవడంతో స్నేహితులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు దుర్గం చెరువులో గాలించగా, రాజేష్ మృతదేహం లభ్యమయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి:
కౌమార సమస్యలపై బడుల్లో అవగాహనా క్లబ్‌లు
జూరాలకు నీటిపై కర్ణాటక యూటర్న్!
Read Latest AP News And Telangana News And International News And Telugu News