డిజిటల్ అరెస్టు పేరుతో హడలెత్తించి..1.42 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:01 AM
జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన వద్ద మీ ఏటీఎం కార్డు దొరికిందని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ హడలెత్తించి హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డు బ్యాంకు ఉద్యోగిని వద్ద సైబర్ నేరగాళ్లు రూ.1.42 కోట్లు కొట్టేశారు.
హైదరాబాద్ సిటీ, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన వద్ద మీ ఏటీఎం కార్డు దొరికిందని డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ హడలెత్తించి హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డు బ్యాంకు ఉద్యోగిని వద్ద సైబర్ నేరగాళ్లు రూ.1.42 కోట్లు కొట్టేశారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడకు చెందిన మహిళ (72) తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఆ వృద్ధురాలి ఫోన్‌కు సెప్టెంబరు 10న కావ్యాగుప్తా అనే మహిళ ఫోన్ చేసింది. మీ మొబైల్ నెంబర్‌తో అనుసంధానమై ముంబై కెనరా బ్యాంకులో ఉన్న ఖాతా నుంచి విదేశాలకు డబ్బు వెళ్లిందని, దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారని, వారిని సంప్రదించాలని సూచించింది.
ఇంతలో వాట్సాప్‌కు వీడియో కాల్ వచ్చింది. పోలీసు దుస్తుల్లో వ్యక్తులు తాము ముంబై పోలీసులమంటూ వృద్ధురాలితో మాట్లాడారు. నరేశ్ గోయల్ వద్ద మీ ఏటీఎం కార్డు లభించందని, వివరణ ఇవ్వాలని, కేసు నమోదైందని వృద్ధురాలిని హడలెత్తించారు. విచారణ నిమిత్తం బ్యాంకు ఖాతాల్లోని డబ్బును ఆర్‌బీఐకి బదిలీ చేయాలని, వెరిఫికేషన్ అనంతరం డబ్బు వెనక్కి వస్తుందని నమ్మబలికారు. దీంతో ఆమె విడతల వారీగా రూ.1.42 కోట్లను వేర్వేరు ఖాతాలకు బదిలీ చేసింది. చివరకు మోసాన్ని గ్రహించిన వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సాగునీటి ప్రాజెక్టులకు చేయూతనివ్వండి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News