Share News

7 గంటల్లో రూ.7.80 కోట్లు స్వాహా

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:12 AM

ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలను టార్గెట్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు అదను చూసి కోట్లు కొట్టేస్తున్నారు.

7 గంటల్లో  రూ.7.80 కోట్లు స్వాహా
Hyderabad Cyber Fraud

  • 82 లావాదేవీల్లో కొట్టేసిన సైబర్‌ నేరగాళ్లు

  • ఆర్థిక సంస్థలను టార్గెట్‌ చేస్తున్న ముఠా

  • గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా

  • ఏటీఎంలు, చెక్‌ల ద్వారా నగదు విత్‌డ్రా

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ ఆర్థిక సంస్థలను టార్గెట్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు అదను చూసి కోట్లు కొట్టేస్తున్నారు. మాదాపూర్‌లోని స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ సంస్థ బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకున్న సైబర్‌ నేరగాళ్ల ముఠా ఈనెల 1న ఆ కంపెనీ ఖాతా నుంచి కేవలం 7గంటల్లో 82 లావాదేవీలతో రూ.7.80 కోట్లు దోచేశారు. ఒకటో తేదీన ఉదయం 10.18 నిమిషాలకు కంపెనీ బ్యాంకు ఖాతా నుంచి ముందుగా ఒక రూపాయి బదిలీ చేశారు. వెంటనే రూ.లక్షతో బోణీ కొట్టి నిమిషాల వ్యవధిలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మ్యూల్‌ ఖాతాలకు 82 లావాదేవీల్లో మొత్తం రూ.7.80 కోట్లు బదిలీ చేశారు. తమ కంపెనీ బ్యాంకు ఖాతాను హ్యాక్‌ చేశారని సాయంత్రానికి గుర్తించిన సంస్థ ప్రతినిధులు వెంటనే బ్యాంకు అధికారులను అప్రమత్తం చేసి, సైబర్‌ క్రైం సెంట్రల్‌ పోర్టల్‌లో తొలుత ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు.


స్పందన స్ఫూర్తి కంపెనీ ఆర్థిక సేవలకు సంబంధించి వాడుతున్న సురక్షితమైన యాప్‌లోకి సైబర్‌ నేరగాళ్లు చొరబడ్డారని, వరుస లావాదేవీల ద్వారా డబ్బు బదిలీ చేసుకుంటూ వెళ్లారని, కొద్ది గంటల్లోనే కొల్లగొట్టిన డబ్బును దేశవ్యాప్తంగా ఏటీఎంల నుంచి, బ్యాంకులో చెక్‌ల ద్వారా విత్‌డ్రా చేసి ఆపై క్యాష్‌ డిపాజిట్‌ ఏటీఎంల ద్వారా షెల్‌ కంపెనీలకు మళ్లించారని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు తెలిపారు. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు వస్తే బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ఆపే అవకాశం ఉంటుందని, ఈ కేసులో చాలా ఎక్కువ సమయం గడవడంతో డబ్బును నేరగాళ్లు విత్‌డ్రా చేసుకుంటూ వెళ్లారని, తెలంగాణలోని రెండు మ్యూల్‌ ఖాతాల నుంచి సైతం డబ్బు విత్‌డ్రా అయినట్లు గుర్తించామని బ్యూరో అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మత్స్యకారులను కాపాడబోయి.. వరద నీటిలో సహాయక సిబ్బంది గల్లంతు

స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలకు ఇక సులువుగా ఫైర్‌ ఎన్‌వోసీ!

మురసు.. ముంచెత్తింది

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 05 , 2026 | 05:12 AM