క్లీన్ సిటీగా హైదరాబాద్
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:12 AM
హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్‌గా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దాలి
చెత్త సేకరణపై నిర్లక్ష్యం వహించొద్దు
అవసరానికి తగ్గట్లు గ్రీన్ ట్యాంకర్లు
అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్‌గా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్యూర్ పరిధిలోని వివిధ ఇండస్ట్రియల్ ఏరియాల్లో చెత్త సేకరణకు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్ స్కేపింగ్, గార్డెనింగ్‌తోపాటు ఇతర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో గ్రీన్ ట్యాంకర్లను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింట్‌నెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని ఉపయోగిస్తున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగిస్తే తాగునీటి ఆదా చేయొచ్చని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సూచించారు. ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News