Share News

ఉత్సాహంగా బీజేపీ మహా పాదయాత్ర

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:58 AM

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం-అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ నినాదంతో సోమవారం భాగ్యనగరంలో బీజేపీ నిర్వహించిన మహా పాదయాత్రకు భారీ స్పందన లభించింది. గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి.

ఉత్సాహంగా బీజేపీ మహా పాదయాత్ర
Amit Shah

  • భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు..

  • యాత్రా మార్గంలో బీజేపీ, జాతీయ జెండాల ప్రదర్శన

  • సర్‌కు సంబంధించి ప్లకార్డులతో.. వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే యత్నం

  • యాత్రకు ముందు భాగ్యలక్ష్మీ ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు

  • ప్రజలు సుఖ శాంతులతో వర్థిల్లాలని కోరుకున్నట్లు ఎక్స్‌లో పోస్ట్‌

  • (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం-అరాచకత్వాన్ని అంతం చేద్దాం’ నినాదంతో సోమవారం భాగ్యనగరంలో బీజేపీ నిర్వహించిన మహా పాదయాత్రకు భారీ స్పందన లభించింది. గ్రేటర్‌తో పాటు పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్‌ వరకు యాత్రా మార్గం కాషాయమయంగా మారిపోయింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా పాల్గొనగా... ఆయన వెంట కేంద్రబొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు, ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ధర్మపురి అరవింద్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఉన్నారు. దారి పొడవునా మోదీ నినాదాలతో, సర్‌ ప్రక్రియకు సంబంధించిన పలు రకాల ప్లకార్డులను ప్రదర్శిస్తూ, జాతీయ జెండా, బీజేపీ జెండాలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు.


ప్రత్యేక విమానంలో నగరానికి..

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.15 గంటలకు బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్‌షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌షా మధ్యాహ్నం 1.14 గంటలకు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హోంమంత్రి పర్యటన నేపథ్యంలో చార్మినార్‌ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3.10 గంటలకు నిజాం కాలేజీ సమీపంలో బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహం నుంచి ప్రారంభమైన బీజేపీ మహా పాదయాత్ర, చాపల్‌రోడ్‌, అబిడ్స్‌ చర్మాస్‌, చౌరస్తా మీదుగా ఎంజే మార్కెట్‌ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర కొనసాగింది.


భద్రతా కారణాల రీత్యా సాయంత్రం 4.14 గంటలకు గన్‌పౌండ్రీ ఎస్‌బీఐ చౌరస్తా వద్ద మహా పాదయాత్రలో అమిత్‌షా వచ్చి చేరారు. అక్కడి నుంచి మోజాంజాహి మార్కెట్‌ క్రాస్‌రోడ్‌ వరకు నడిచారు. యాత్రా మార్గంలో ఇరువైపుల ఉన్న బహుళ అంతస్తుల భవనాలపైకి అభిమానులు చేరి.. జై శ్రీరామ్‌, భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. బోనాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శనలు, విన్యాసాలు పాదయాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌, గోరక్షక దళ్‌, సంఘ్‌ పరివార్‌ సంస్థల నాయకులు.. టీడీపీ, జనసేన పార్టీల కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ మెడికల్‌ సెల్‌ నేతలు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోను అంపశయ్యపై పెట్టి యాత్రలో పాల్గొన్నారు. ఖైరతాబాద్‌ జోన్‌ జిల్లా డీసీపీ శిల్పవల్లి, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో.. మహాపాదయాత్ర ప్రశాంతంగా ముగిసింది. బషీర్‌బాగ్‌ చౌరస్తా, నాంపల్లి లిబర్టీ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేయకపోవడంతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. 5.05 గంటలకు ప్రసంగం ముగిసిన అనంతరం అమిత్‌షా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే

పండగ ముందు.. మిఠాయి చేదు!

చుక్కను పట్టి.. పచ్చని వనమై!

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 03:58 AM