హైదరాబాద్‌లో సీఐడీ అధికారుల సోదాలు
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:26 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ న్యాయవాది కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం కేసులో నిందితురాలు ధరణి కృష్ణ కోసం ఓ న్యాయవాది కార్యాలయంలో తనిఖీలు
హైదరాబాద్, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.7 కోట్ల ఉద్యోగాల కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఓ న్యాయవాది కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ప్రధాన నిందితురాలు బోడపాటి ధరణి కృష్ణ గురించిన సమాచారం ఆయన వద్ద ఉందని సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ధరణి కృష్ణకు సంబంధించిన ఆధారాలు, నకిలీ ఉద్యోగ పత్రా ల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
జనసేన నేతల పేర్లు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ధరణి కృష్ణ, పెద్దిరాజు పెద్దమొత్తంలో డబ్బులు వసూలుచేసి, నకిలీ నియామక పత్రాలిచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఐడీ అధికారులు దర్యాప్తు చే పట్టారు. ఈ కేసులో పెద్దిరాజు(ఏ2)ను ఇటీవల హైదరాబాద్‌లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. మంగళగిరిలోని కెరైన్ కన్సల్టెన్సీలో హెచ్‌ఆర్ ఆపరేషన్స్ విభాగంలో పనిచేసిన సమయంలో ధరణి కృష్ణ నకిలీ బిల్లులు రూపొందించి డబ్బు కాజేసిన ఆరోపణలపై మరో కేసు నమోదైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం
ఇందిరాగాంధీ అనునిత్యం దేశం, పేదల కోసం శ్రమించారు: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News