Share News

భయాందోళనలకు గురికావద్దు.. బాంబు బెదిరింపులపై సీపీ మహేశ్ భగవత్ కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:44 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల బెదిరింపులపై సీపీ మహేశ్ భగవత్ కీలక ప్రకటన చేశారు.

భయాందోళనలకు గురికావద్దు.. బాంబు బెదిరింపులపై సీపీ మహేశ్ భగవత్ కీలక ప్రకటన
bomb threat security alert

హైదరాబాద్, నవంబరు 23: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల బెదిరింపులపై సీపీ మహేశ్ భగవత్ స్పందించారు. ప్రజలందరూ ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని సీపీ స్పష్టం చేశారు.


‘బాంబు బెదిరింపుల అంశంపై భయాందోళనలకు గురికావద్దు. నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాం. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద భద్రతను రెట్టింపు చేశాం. ఇప్పటికే ఈ బెదిరింపుల మెయిల్‌కు సంబంధించి.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాం. మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది. ఎవరు పంపించారు. అనే కోణంలో దర్యాప్తు చేపట్టాం. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే.. 112కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి’ అంటూ సీపీ కోరారు.


ఈ వార్తలూ చదవండి

పార్టీకి నష్టపరిచేలా మాట్లాడితే చర్యలు.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

Updated Date - Nov 23 , 2026 | 12:44 PM