హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం.. బాంబు బెదిరింపులపై సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 26 , 2026 | 01:14 PM
హైదరాబాద్‌లో పలుచోట్ల బాంబు దాడులకు పాల్పడతామంటూ వస్తోన్న బెదిరింపులపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, నవంబరు 26: నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు వస్తోన్న బెదిరింపు ఈ మెయిల్స్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బెదిరింపులతో ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలో దర్యాప్తును ముమ్మరం చేశామని, బెదిరింపులకు పాల్పడుతున్న నిందితులను త్వరలోనే గుర్తిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. రద్దీ ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో చెక్ చేస్తున్నాం. విమానంలో బాంబు ఉందంటూ తప్పుడు సమాచారం వస్తే.. విమానం వెనక్కి రావాల్సిందే.. ప్రయాణికులను ఖాళీ చేయించాల్సిందే. బాంబు బెదిరింపులతో ప్రజలను, అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బాంబు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న వారిని గుర్తించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసుల సైబర్ క్రైమ్ టీమ్స్ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఏఐ సాంకేతికతను ఉపయోగించి, తమ లొకేషన్ తెలియకుండా నిందితులు బెదిరింపు మెయిల్స్ పంపుతున్నట్లు వారు గుర్తించారు. బాంబు బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్న నిందితులను త్వరలోనే గుర్తిస్తాం. ప్రజలు భయాందోళనలకు గురికావద్దు’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
న్యూ ఇయర్‌కు ముందే.. మాదకద్రవ్యాల రవాణా
Read Latest AP News And Telangana News And International News And Telugu News