Share News

‘దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలి’.. సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:31 PM

ఎన్నికల్లో తనతో పోటీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు.

‘దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలి’.. సీఎం రేవంత్‌కు హరీశ్ సవాల్
Harish Rao

హైదరాబాద్, నవంబర్ 20: ఎన్నికల్లో తనతో పోటీకి రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. దమ్ముంటే సిద్దిపేటకు వచ్చి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. నీళ్ల విషయంలో నాడు.. నేడు కాంగ్రెస్సే ద్రోహం చేసిందని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా ఆధారాలు బయటపెడతానన్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్రేషన్‌తో తన ఎత్తు గురించి.. కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.


సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగంలో అబద్ధపు మాటలు.. టన్నుల కొద్దీ బూతులు ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు. సీఎం సభ కోసం 26 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించారని తెలిపారు. సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారని... అవినీతి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ నీటిని ఏపీకి తరలిస్తూ జలదోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు.


నిన్న సభలో కేసీఆర్, కేటీఆర్‌తో పాటు తన పేరును 140 సార్లు చెప్పారని మాజీ మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున ఉందనడానికి నిన్నటి సభ నిదర్శనంగా చెప్పుకొచ్చారు. స్వాతి ముత్యంలో కమలహాసన్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ వ్యాఖ్యానించారు. తాము రాజీనామా చేశాక పోతిరెడ్డిపాడు జీవో వచ్చిందని.. అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి ముక్కు నేలకి రాసి క్షమాపణలు చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

బీఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.. బీజేపీ పోటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 03:42 PM