Share News

బీఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.. బీజేపీ పోటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Nov 20 , 2026 | 01:48 PM

బీఆర్ఎస్సే ప్రధాన శత్రువని.. బీజేపీ పోటీ కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హిందువులను ఒకటి చేయడానికి మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని.. ముస్లింలను ఒకటి చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.. బీజేపీ పోటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 20: ‘బీఆర్ఎస్ మాకు ప్రధాన శత్రువు.. బీజేపీ మాకు పోటీ కాదు’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హిందువులను ఒకటి చేయడానికి మోదీ, అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారని.. ముస్లింలను ఒకటి చేయడానికి అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దేశ జనాభాలో 15 శాతం ఉన్న వాళ్లను కూడా కలుపుకుని వెళ్లాల్సిందే అని చెప్పుకొచ్చారు. బీజేపీ మైనారిటీ రిజర్వేషన్లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల కోసం పనిచేస్తోందన్నారు.


ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యకు బర్త్‌డే విషెస్

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు విద్యాన‌గ‌ర్‌లోని రామయ్య నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఆయనకు విషెస్ తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అందే విద్య.. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అందించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 27 లక్షల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో హాజరుశాతం కూడా పెరిగిందన్నారు. పదో తరగతి తర్వాత డ్రాప్‌ అవుట్స్ బాగా ఉన్నాయని చెప్పారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడం కోసం స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని అన్నారు.


మా విద్యార్థులు సంస్థలను స్థాపించాలని కోరుకుంటున్నా..

స్కిల్స్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారని.. ఇక్కడ చదువుకునే వాళ్లకు వంద శాతం ఉద్యోగాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐల్లో పాతకాలం చదువులే కొనసాగుతున్నాయని.. అందుకే ఐటీసీలుగా మార్చామని వివరించారు. ఐటీసీల కోసం నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని.. ఇందులో టాటా సంస్థ 86 శాతం ఖర్చు పెడుతోందని అన్నారు. తెలంగాణ విద్యార్థులు సంస్థల్లో పనిచేయడం కాదని.. సంస్థలనే స్థాపించాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ లాంటి అంతర్జాతీయ విద్యా సంస్థలు తెలంగాణలో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ సోదాలు

కాంగ్రెస్ మంత్రులకు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి రిక్వెస్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 01:55 PM