Share News

పీఎం స్వనిధి అమలులో ఏపీ మెప్మాకు జాతీయ అవార్డులు.. మంత్రి నారాయణ హర్షం

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:02 PM

పీఎం స్వనిధి స్కీమ్ అమలులో మెప్మాకు(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) జాతీయ స్థాయిలో అవార్డులు రావడంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యంలో తక్కువ వడ్డీకే రుణాలను ఏపీ ప్రభుత్వం మంజూరు చేయిస్తోంది.

పీఎం స్వనిధి అమలులో ఏపీ మెప్మాకు జాతీయ అవార్డులు.. మంత్రి నారాయణ హర్షం
Minister Narayana

అమరావతి, నవంబర్ 20: పీఎం స్వనిధి స్కీమ్ అమలులో మెప్మాకు(పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) జాతీయ స్థాయిలో అవార్డులు రావడంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు మెప్మా ఆధ్వర్యంలో తక్కువ వడ్డీకే రుణాలను ఏపీ ప్రభుత్వం మంజూరు చేయిస్తోంది. పథకం అమల్లో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో, ఎక్కువ మందికి రుణాల మంజూరులో రెండో స్థానంలో, స్పెషల్ క్యాంప్‌ల నిర్వహణలో ప్రథమ స్థానంలో ఏపీ మెప్మా నిలిచింది. అలాగే వీధి వ్యాపారుల కుటుంబాలకు సంక్షేమ పథకాలను అమలు చేసే స్వనిధి సే సమృద్ధి కార్యక్రమంలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలు ముందంజలో ఉన్నాయి.


జాతీయ స్థాయిలో రామచంద్రాపురం, అమలాపురం మున్సిపాలిటీలు.. మొదటి, రెండో స్థానాల్లో అవార్డులు పొందాయి. అలాగే డిజిటల్ లావాదేవీల నిర్వహణలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో అవార్డులు పొందిన అధికారులు, ఆయా మున్సిపాలిటీల సిబ్బందికి మంత్రి నారాయణ అభినందనలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధతో పట్టణాల్లో మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మెప్మా ద్వారా మహిళలను ఆర్థికంగా వృద్ధి చెందేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తం

పగిడ్యాల ఎంపీపీ ఎన్నిక మరోసారి వాయిదా.. కోరం లేక నిలిచిన ప్రక్రియ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 20 , 2026 | 03:15 PM