Share News

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:16 AM

‘గోదావరి పుష్కరాలు - 2027’ అధికారిక లోగో, ట్యాగ్‌లైన్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తోంది.

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు

  • వర్క్‌షాప్‌ ప్రారంభించిన మంత్రులు ఉత్తమ్‌, పొన్నం

హైదరాబాద్‌, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘గోదావరి పుష్కరాలు - 2027’ అధికారిక లోగో, ట్యాగ్‌లైన్‌ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పోటీలు నిర్వహిస్తోంది. నది చారిత్రక ప్రాధాన్యత, ఆధ్యాత్మిక విశిష్టత, పుష్కరాల ప్రత్యేకతతోపాటు ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా లోగో, ట్యాగ్‌లైన్‌ ఎంట్రీలను ఈ నెల 30 లోగా పంపాలని ఔత్సాహికులను రాష్ట్ర దేవాదాయశాఖ కోరింది.


ఈ పోటీల్లో పాల్గొనే ఆర్ట్‌ విద్యార్థులు, ఇతర ఔత్సాహికుల కోసం ఏర్పాటు చేసిన వర్క్‌షాపును సోమవారం హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంకు వద్ద గల జవహర్‌లాల్‌ నెహ్రూ ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల లోగో, ట్యాగ్‌లైన్‌ డిజైన్లలో ఉత్తమమైన మూడింటికి రాష్ట్ర ప్రభుత్వం.. రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేలు చొప్పున నగదు బహుమతి అందించనుందన్నారు. గోదావరి పుష్కరాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతోపాటు కళాకారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికే లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 05:16 AM