Share News

హైదరాబాద్‌లో అద్భుతం.. 3.8 లక్షల వజ్రాలతో కొలువుదీరిన గణపయ్య ..

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:58 AM

హైదరాబాద్ బేగంబజార్‌లో 24 క్యారెట్ల బంగారంతో, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది. దీన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.

హైదరాబాద్‌లో అద్భుతం.. 3.8 లక్షల వజ్రాలతో కొలువుదీరిన గణపయ్య ..
ganesh idol

ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏటా ప్రతేక్యమైన, విభిన్నమైన వినాయకుడి విగ్రహాలను చూస్తూనే ఉంటాం. కరెన్సీ గణపతి, కూరగాయల గణపతి ఇలా రకరకాల రూపంలో గణనాథుడు దర్శనమిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 24 క్యారెట్ల బంగారంతో, 3 లక్షల 83 వేల అమెరికన్ డైమండ్లతో తయారు చేసిన ఈ గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బేగంబజార్‌లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ బంగారు గణపయ్య దర్శనమిస్తున్నాడు. వజ్రాలతో కొలువుదీరిన గణేశుణ్ని చూసి తరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. బంగారు నిగనిగలతో, వజ్రాల ధగధగలతో వెలిగిపోతున్న వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.


జ్యువెలరీ షాపు యజమాని ఆధార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి కోసం ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించామని చెప్పారు. గత రెండేళ్లుగా తమ షాపులో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సారి దశావతారాన్ని గుర్తు చేసేలా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ముంబైలోని లాల్‌బాగ్‌చా రాజా, తిరుపతిలోని వేంకటేశ్వర స్వాముల రూపాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ బంగారు ప్రతిమను తయారు చేశామని వెల్లడించారు. ఈ విగ్రహాన్ని చేయడానికి 8 మంది నిపుణులు 8 నెలల పాటు కష్టపడ్డారన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుపతిలో ఏడు టన్నుల విభూతితో 11 అడుగుల భారీ వినాయకుడు..

వినాయక చవితి వేళ ప్రత్యేక ఆకర్షణగా గోల్డెన్ మోదక్.. కిలో రూ.27,000..

Updated Date - Sep 15 , 2026 | 12:04 PM