Share News

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:24 AM

అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం సమావేశమయ్యారు.

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు
CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 15: అగా ఖాన్ ఫౌండేషన్‌పై అత్యంత గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు(మంగళవారం) తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘మా వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో అగా ఖాన్ ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో ఇటీవలే మా శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించుకున్నాం. అగా ఖాన్ ఫౌండేషన్ కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించింది’ అని తెలిపారు. మూసీ నది పునరుజ్జీవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నట్లు తెలిపారు.


CM Revanth Reddy

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని చెప్పారు. మూసీ నదిని నైట్ ఎకానమీ కోసం తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తప్పకుండా గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

aga-khan-revanth2.jpg


డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరవుతారన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని.. నెట్-జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ ఉండబోతుందని అన్నారు. ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. సింగపూర్‌కు చెందిన కంపెనీ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ లాంటి సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

aga-khan-revanth3.jpg


ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 15 , 2026 | 01:00 PM