Share News

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

ABN , Publish Date - Sep 15 , 2026 | 11:51 AM

భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని లోయర్ మాన్‌హటన్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. మ‌ృతులను న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రె (24), అదే రాష్ట్రం సేర్‌విల్లేకు చెందిన నవం కౌల్‌గా గుర్తించారు.

అమెరికాలో ఘోర ప్రమాదం.. భారత సంతతి యువతి, యువకుడిపై దూసుకెళ్లిన రైలు

ఇంటర్‌నెట్ డెస్క్: భారత సంతతి యువతి, ఆమె స్నేహితుడి పైనుంచి రైలు దూసుకెళ్లడంతో ఆ ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదం అమెరికాలో న్యూయార్క్‌ రాష్ట్రంలోని లోయర్ మాన్‌హటన్ సబ్‌వే స్టేషన్‌లో జరిగింది. మ‌ృతులను న్యూజెర్సీలోని డేటన్ నివాసి మలైకా చిత్రె (24), అదే రాష్ట్రం సేర్‌విల్లేకు చెందిన నవం కౌల్‌గా గుర్తించారు. కౌల్ నేపాల్ సంతతి వ్యక్తి. ఇద్దరూ రట్జెర్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఇద్దరూ మాన్‌హటన్ సబ్‌వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్ 4పై కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో కౌల్ కిందపడగా.. అతడిని కాపాడేందుకు చిత్రె కూడా కిందికి దిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంతలోనే ఒక రైలు వారిపై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కౌల్‌ను చిత్రె నవ్వుతూ లాగుతున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో రైల్లో 100 మంది ప్రయాణికులు ఉన్నారు. దుర్ఘటన తర్వాత వారందరినీ ఖాళీ చేయించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇద్దరూ రట్జెర్స్ వర్సిటీ స్టూడెంట్లు..

మలైకా చిత్రె, నవం కౌల్ ఇద్దరూ రట్జెర్స్ యూనివర్సిటీ స్టూడెంట్లు. రట్జెర్స్ బిజినెస్ స్కూల్‌లో కౌల్ 2020 నుంచి 2024 వరకు చదివాడు. అయితే, అతను డిగ్రీ పూర్తిచేయలేదు. చిత్రె 2024 మేలో రట్జెర్స్ న్యూ బ్రన్స్‌విక్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అకాడియా ఫార్మస్యూటికల్స్‌లో ఆమె ఆపరేషన్స్ స్పెషలిస్టుగా పనిచేస్తుండగా.. కౌల్ బ్లూంబర్గ్‌లో డేటా అనలిస్టుగా పనిచేస్తున్నాడు.


Also Read:

ఏఐ ఇప్పటికే మనుషుల్లా ఆలోచిస్తోంది: నిక్ బోస్ట్రోమ్ సంచలన వ్యాఖ్యలు

ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ భేటీ.. మూసీపై కీలక చర్చలు

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Updated Date - Sep 15 , 2026 | 12:20 PM