Share News

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:33 AM

వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా, సీఎం రేవంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతి, సుఖసంతోషాలతో వర్థిల్లాలని వారు ఆకాంక్షించారు.

విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
Telangana Governor, CM Ganesh Greetings

  • గవర్నర్‌, సీఎం పండుగ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం శాంతి, ఐక్యత, ప్రగతి, సుఖసంతోషాలతో వర్థిల్లాలని గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆకాంక్షించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ హిందీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో విఘ్నాలు తొలగి ఆనందం, ఐశ్యర్యం, ఆరోగ్యం లభించాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆకాంక్షించారు. వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు సౌకర్యాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ కూడా వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ప్రైవేటు భూమిపై ముదిరాజ్‌ నేతల కన్ను
సర్‌లో పారదర్శకత ఏదీ?

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 05:45 AM