Share News

నలుగురు కొడుకులున్నా.. అనాథగా వృద్ధురాలు!

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:22 AM

అల్లారు ముద్దుగా పెంచిన నలుగురు కొడుకులు వృద్ధాప్యంలో తనను కనీసం పట్టించుకోవడం లేదని, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని ఓ 80 ఏళ్ల వృద్ధురాలు కలెక్టరేట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు.

నలుగురు కొడుకులున్నా.. అనాథగా వృద్ధురాలు!

  • కోర్టు ఆదేశాలనూ పట్టించుకోని కుమారులు

  • న్యాయం చేయాలని కలెక్టరేట్‌ మెట్లెక్కిన 80 ఏళ్ల బామ్మ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): అల్లారు ముద్దుగా పెంచిన నలుగురు కొడుకులు వృద్ధాప్యంలో తనను కనీసం పట్టించుకోవడం లేదని, కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని ఓ 80 ఏళ్ల వృద్ధురాలు కలెక్టరేట్‌లో కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తిరిగే ఓపిక లేదంటూ సోమవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో మరోసారి ఫిర్యాదు చేశారు. సైదాబాద్‌లోని డాక్టర్‌ జాకీర్‌ హుస్సేన్‌ కాలనీకి చెందిన వహీదున్నీసా బేగం (80) భర్త మీర్‌ ఆజం అలీ మరణానంతరం జీవనాధారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన నలుగురు కుమారులు పోషణ బాధ్యతలు పట్టించుకోవడం లేదని తెలిపారు.


ఈ విషయమై 2016లో నాలుగో మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును ఆశ్రయించగా.. నెలవారీ భరణం, ఇంటి అద్దె చెల్లించడంతో పాటు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని, కంటి ఆపరేషన్‌ చేయించాలని కోర్టు కుమారులను ఆదేశించినట్లు వెల్లడించారు. అయినప్పటికీ ఏళ్లుగా ఆ ఉత్తర్వులు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రజావాణిలో నాలుగుసార్లు ఫిర్యాదు చేయడంతో పాటు హైదరాబాద్‌ ఆర్డీవోను కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వృద్ధురాలు వాపోయారు. వీల్‌చైర్‌లో కలెక్టరేట్‌కు వచ్చిన ఆమె.. తనకు రావాల్సిన భరణం ఇప్పించి, తగిన రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పార్టీకి నష్టం చేసేలా మాట్లాడితే చర్యలు.. సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్‌లో ఉగ్రదాడుల హెచ్చరిక.. పోలీసుల హై అలర్ట్!

తెలంగాణలో ష్నైడర్‌ సంస్థ విస్తరణకు పూర్తి సహకారం అందిస్తాం: భట్టి విక్రమార్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:22 AM