Share News

ఫేస్‌బుక్‌లో పరిచయమై కానిస్టేబుల్‌కే టోకరా!

ABN , Publish Date - Nov 03 , 2026 | 05:16 AM

ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ట్రేడింగ్‌ మోసాల్లో పెద్ద సంఖ్యలో సామాన్యులు డబ్బు పోగొట్టుకుంటూనే ఉన్నారు.

ఫేస్‌బుక్‌లో పరిచయమై కానిస్టేబుల్‌కే టోకరా!
Facebook friendship fraud

  • రూ.29.20 లక్షలు వసూలు చేసిన కిలేడీ!!

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. ట్రేడింగ్‌ మోసాల్లో పెద్ద సంఖ్యలో సామాన్యులు డబ్బు పోగొట్టుకుంటూనే ఉన్నారు. పోలీసు విభాగంలో పనిచేస్తూ... నేరాలతో పాటు సైబర్‌ నేరాలపై అవగాహన ఉన్న ఓ కానిస్టేబుల్‌ సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.29.20 లక్షలు పోగొట్టుకున్నాడు. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆ కానిస్టేబుల్‌కు ఫేస్‌బుక్‌లో సుకన్యారెడ్డి పేరుతో ఓ మహిళ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపింది. దాన్ని ఆమోదించిన అనంతరం తరచూ చాటింగ్‌ చేసుకుంటూ వాట్సా్‌పలో నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని సంభాషించుకోవడం ప్రారంభించారు.


ఈ తరుణంలో సదరు మహిళ ‘‘డార్విన్‌ ఎక్స్‌ గ్లోబల్‌’’ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు గడించవచ్చని సూచించింది. ఆ మాటలు నమ్మిన కానిస్టేబుల్‌.. తొలుత చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టాడు. అప్లికేషన్‌లో లాభాలు వచ్చినట్లు చూపడం, విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉండటంతో పలు దఫాలుగా రూ.29.20లక్షలు వేర్వేరు ఖాతాలకు పంపాడు. తక్కువ సమయంలోనే రూ.76 లక్షలు వచ్చినట్లు అప్లికేషన్‌లో చూపించడంతో ఆనంద పడ్డాడు. విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా... ట్యాక్స్‌, ఎక్స్చేంజ్‌ చార్జీలు, రిలీజింగ్‌ ఫండ్‌ మొత్తం రూ. 12 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేయడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ మెట్రోకు రూ.275 కోట్లు

ట్రూ-అప్‌ భారం ప్రజలపైనే..

నేడు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 05:18 AM