Share News

జిల్లా కేంద్రాల నుంచి ఎయిమ్స్‌కు బస్సులు నడపండి

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:31 AM

రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి బీబీనగర్‌లోని ‘ఎయిమ్స్‌’ ఆస్పత్రికి నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కోరారు.

జిల్లా కేంద్రాల నుంచి ఎయిమ్స్‌కు బస్సులు నడపండి
Vinod Kumar

  • మంత్రి పొన్నం, ఆర్టీసీ ఎండీలకు బీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి బీబీనగర్‌లోని ‘ఎయిమ్స్‌’ ఆస్పత్రికి నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత బోయినపల్లి వినోద్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీజీఎస్‌ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డిలకు లేఖ రాశారు. అన్ని జిల్లాల ప్రజలకు సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తేవడానికి యాదాద్రి-భువనగిరి జిల్లాలోని బీబీ నగర్‌ ఎయిమ్స్‌కు సమగ్ర బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు.


హైదరాబాద్‌లోని ఉప్పల్‌ జంక్షన్‌ నుంచి ప్రయాణికుల సౌకర్యం, నిర్వహణా సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ఆస్పత్రి రద్దీ వేళల్లో ప్రతి 30 నిమిషాలకో బస్సును నడపాలన్నారు. ఎయిమ్స్‌ ద్వారా సమీప ప్రాంతాల ప్రజలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రజలు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్నారు. నిరంతరం వైద్య పరీక్షలు, వైద్యుల సంప్రదింపుల కోసం ఎయిమ్స్‌కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత సర్కారుదేనని, రోగుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని.. ఎయిమ్స్‌కు రవాణా సౌకర్యం కల్పించాలని టీజీఎస్‌ ఆర్టీసీ అధికారులకు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!

రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్‌!

ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:31 AM