Share News

అప్పులతో తెలంగాణను సర్వనాశనం చేశారు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:20 PM

మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలన్నారు.

అప్పులతో తెలంగాణను సర్వనాశనం చేశారు.. బీఆర్‌ఎస్‌పై భట్టి విక్రమార్క ఫైర్
Bhatti Vikramarka

హైదరాబాద్, జులై 3: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ పాలనలో అప్పులపై కేసీఆర్ స్పందించాలన్నారు. ఈరోజు(శుక్రవారం) భట్టి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో మొత్తం అప్పు రూ.8.21 లక్షల కోట్లు అని.. మొత్తం అప్పుల్లో గత ప్రభుత్వ బకాయిలు ఉన్నాయని తెలిపారు. అప్పులు అన్నీ వాస్తవాలు కాదా.. వీటిని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. అప్పులపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


అప్పులను తక్కువ చేసి చూపేందుకే కేటీఆర్‌, హరీశ్ ప్రయత్నిస్తున్నారని ఉపముఖ్యమంత్రి మండిపడ్డారు. మంత్రిగా పనిచేశానని మర్చిపోయి మరీ హరీశ్ మాట్లాడుతున్నారని.. అనేక అంశాలపై అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వాస్తవాలను ప్రజల దృష్టికి తేవాలన్నారు. బీఆర్‌ఎస్ నేతల అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లకూడదన్నారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదులపై పదేళ్లు పరిపాలించారని.. బీఆర్‌ఎస్ చేసిన అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విరుచుకుపడ్డారు. అప్పుల భారం రాష్ట్రంపై వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. బుకాయింపులు, అసత్యాలతో ఎన్నాళ్లు మోసం చేస్తారంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా చూసుకుందాం: మంత్రి జూపల్లి సవాల్

మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు: హరీశ్ రావు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 02:25 PM