మంత్రులు గోల్ కొడతామని.. సెల్ఫ్ గోల్ అయ్యారు: హరీశ్ రావు
ABN , Publish Date - Jul 03 , 2026 | 01:53 PM
తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు.
సంగారెడ్డి, జులై 3: తెలంగాణ అప్పులకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు రాసిన లేఖపై బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పులపై మంత్రి జూపల్లి పంపిన వాట్సాప్ లేఖ అందిందని తెలిపారు. అప్పులపై మంత్రి, ముఖ్యమంత్రి మాటలు విరుద్ధంగా ఉన్నాయన్నారు. అప్పులపై అసెంబ్లీలో తాను మాట్లాడిన వీడియో, ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో జూపల్లికి పంపినట్లు చెప్పారు. మంత్రి లెక్క ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు రూ.1.77 లక్షల కోట్లు అని.. RBI లెక్కల ప్రకారం రూ.1.86 లక్షల కోట్లు అని తెలిపారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పిన ప్రకారం రూ.3.47 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు.
జూపల్లి సవాల్‌పై..
పూటకో సవాల్.. రోజుకో అడ్రస్‌లా మంత్రి జూపల్లి తీరు ఉందని హరీశ్ వ్యాఖ్యానించారు. నిన్న తెలంగాణ భవన్‌కు వస్తానని చెప్పింది జూపల్లే అని.. మాటమార్చి గన్‌పార్క్‌కు వెళ్లారన్నారు. గన్‌పార్క్‌కు రాకుండా తమను పోలీసులు అడ్డుకున్నారన్నారు. చర్చకు కేసీఆర్ రావాలని ఇప్పుడు అంటున్నారని తెలిపారు. మంత్రులు గోల్ కొడతామని సెల్ఫ్ గోల్ అయ్యారని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి...
పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు
పాలమూరు పౌరుషమా? కల్వకుంట్ల పౌరుషమా చూసుకుందాం: మంత్రి జూపల్లి సవాల్
Read Latest Telangana News And Telugu News