సాయికృష్ణ కేసు.. కోర్టుకు కీలక విషయాలు తెలిపిన సిట్
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:32 PM
గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కోర్టుకు సిట్ ముఖ్య విషయాలు తెలియజేసింది.
విజయవాడ, జులై 3: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీ కోరుతూ దాఖలు చేసిన మెమోలో కోర్టుకు సిట్ ముఖ్య విషయాలు తెలియజేసింది. కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ స్టేషన్‌లో లేదని.. అవి ధ్వంసమయ్యే అవకాశం ఉన్నట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ గుర్తించిందని సిట్ వెల్లడించింది. స్టేషన్‌లో అనుమానాస్పద మరకలు గుర్తించినట్లు తెలిపింది. అనుమానాస్పద మరకలు ఉన్న లాఠీ, ఎముకలు, కాలిపోయిన బూడిద, పాక్షికంగా కాలిన ఇనుప హ్యాండ్ గొలుసును స్టేషన్ టెర్రస్ నుంచి సీజ్ చేసినట్లు పేర్కొంది.
సాయికృష్ణ కస్టడీలో తీవ్ర గాయాలతో మృతి చెందాడని కొందరి స్టేట్‌మెంట్ల ఆధారంగా గుర్తించామని సిట్ తెలిపింది. మృతదేహాన్ని ఏం చేశారనే విషయాన్ని కస్టడీకి అనుమతిస్తే సీఐ నాగరాజును తీసుకువెళ్లి గుర్తిస్తామని మెమోలో సిట్ పేర్కొంది.
ఇవి కూడా చదవండి...
మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు
పొగాకు కొనుగోళ్లలో అక్రమాలను సహించం: మంత్రి అచ్చెన్నాయుడు
Read Latest AP News And Telugu News