Share News

మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు

ABN , Publish Date - Jul 03 , 2026 | 10:17 AM

మచిలీపట్నం ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్‌ను ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు.

మచిలీపట్నం ఇనగుదురు పీఎస్‌కు జోసెఫ్ రావణ్.. ప్రశ్నిస్తున్న పోలీసులు
Joseph Ravan

కృష్ణా జిల్లా, జులై 3: మచిలీపట్నం ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌లో ప్రముఖ యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో రావణ్‌ను ఇనగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈరోజు(శుక్రవారం) తెల్లవారుజామున ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద ఆంక్షలు కొనసాగుతున్నాయి. స్టేషన్‌ గేట్లను మూసివేసిన పోలీసులు.. ఎలాంటి గొడవలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్‌ఛార్జి ఉడుముల బుజ్జి ఇచ్చిన ఫిర్యాదుతో రావణ్‌పై కేసు నమోదు అయ్యింది.


సోషల్ మీడియా వేదికగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జోసెఫ్ రావణ్‌ను బుధవారం(జులై 1) పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అక్కడే మరో కేసులో రావణ్‌ను కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం(జులై 2) అరెస్ట్ చేశారు. అక్కడ కూడా ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. ఇదే సమయంలో కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు.. రావణ్‌పై మరో కేసు నమోదు చేశారు. దీంతో బెయిల్ వచ్చిన వెంటనే రావణ్‌ను మచిలీపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఇనగుదురు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. రావణ్‌ను విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

ఘోర రోడ్డుప్రమాదం.. స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

హైదరాబాద్‌లోని లాడ్జ్‌లో యువతి అనుమానాస్పద మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 03 , 2026 | 11:41 AM