Share News

కులవివక్షను అడ్డుకోవడమే లక్ష్యంగా రోహిత్ వేముల బిల్లు: ఉపముఖ్యమంత్రి భట్టి

ABN , Publish Date - Oct 16 , 2026 | 08:03 PM

రోహిత్ వేముల తెలంగాణ బిల్లుపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో సమగ్ర ముసాయిదాను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

కులవివక్షను అడ్డుకోవడమే లక్ష్యంగా రోహిత్ వేముల బిల్లు: ఉపముఖ్యమంత్రి భట్టి
deputy cm batti vikramarka on rohith vemula bill

హైదరాబాద్, అక్టోబర్ 16: విద్యార్థుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా రోహిత్ వేముల బిల్లును సమగ్రంగా రూపొందించాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.


ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష, సామాజిక బహిష్కరణను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రోహిత్ వేముల తెలంగాణ బిల్లు-2026’ను రూపొందిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఈ బిల్లుకు సంబంధించి సమగ్ర ముసాయిదాను 3 నెలల్లో రూపొందించేలా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ధి శాఖ నేతృత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కమిటీలో న్యాయ, విద్య, హోంశాఖలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. న్యాయపరమైన అంశాల్లో నల్సార్ యూనివర్సిటీ సహకారం తీసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు. దానితోపాటు విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయ నిపుణుల నుంచి అభిప్రాయాల సేకరణను చేపట్టనున్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్.. ఫోన్ నంబర్లు ఇవే

Updated Date - Oct 16 , 2026 | 08:08 PM